గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలని లున్వా గ్రామంలో శ్రీ కే.టీ.పాటిల్ స్మృతి విద్యాలయ స్కూలు మతవివక్షకు పరాకాష్ఠ ఎలా ఉంటుందో చూపించింది. పదవతరగతిలో 87 శాతం మార్కులతో టాపర్ గా నిలిచిన అర్నాజ్ బాను అనే ముస్లిం అమ్మాయి ఈ వివక్షను చూసి కన్నీళ్ళతో ఇంటికి మరలిపోయింది.
గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలని లున్వా గ్రామంలో శ్రీ కే.టీ.పాటిల్ స్మృతి విద్యాలయ స్కూలు మతవివక్షకు పరాకాష్ఠ ఎలా ఉంటుందో చూపించింది. పదవతరగతిలో 87 శాతం మార్కులతో టాపర్ గా నిలిచిన అర్నాజ్ బాను అనే ముస్లిం అమ్మాయి ఈ వివక్షను చూసి కన్నీళ్ళతో ఇంటికి మరలిపోయింది. ఈ స్కూలులో స్వతంత్ర దినోత్సవ వేడుకులు జరిపారు. పదవతరగతి, పన్నెండవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులిచ్చారు. కాని టాపర్ గా నిలిచిన అర్నాజ్ బాను పేరు కూడా ఎవరు ఎత్తలేదు. తనకు అవార్డు వస్తుందని ఇంటి వద్ద గర్వంగా చెప్పి వెళ్ళిన అమ్మాయి కన్నీళ్ళతో తిరిగి రావడంతో తండ్రి సన్వర్ కాన్ స్కూలు వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాపర్ గా నిలిచిన తనకు ఇవ్వవలసిన అవార్డును రెండవస్థానంలో వచ్చిన మరో విద్యార్థికి స్కూలు ప్రదానం చేసిందట. ఈ విషయమై తండ్రి ప్రశ్నిస్తే స్కూలు అధికారులు జవాబేమీ ఇవ్వలేదట. జనవరి 26 న ఇస్తామన్నారట. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు జవాబు లేదు. స్కూలు ప్రిన్సిపాలు బిపిన్ పాటిల్ మాత్రం తమ స్కూలు ఎలాంటి వివక్షలు లేని గొప్ప స్కూలని చెప్పుకుంటున్నాడు. టాపర్ గా నిలిచిన అమ్మాయికి జనవరి 26న అవార్డు తప్పక ఇస్తామంటున్నారు. అగష్టు 15న ఆమె స్కూలుకు రాలేదు కాబట్టి ఇవ్వలేదన్నాడు. కాని అది అబద్దం. అగష్టు 15 న ఆమె స్కూలుకు వెళ్ళింది. కావాలంటే సీసి టీవీ ఫుటేజి చూసుకోండని తండ్రి సవాలు చేశాడు. ఇది మోడీ ఫైడ్ ఇండియా అని సలీల్ త్రిపాఠీ అనే సామాజిక కార్యకర్త ట్వీటు చేశారు. ప్రధాని మోడీ ’’సేవ్ డాటర్స్.. ఎడ్యుకేట్ డాటర్స్‘‘ నినాదాలు బలంగా వినిపిస్తున్నారు.