(జిన్యూస్ వెబ్ సైట్, అగష్టు 2 సౌజన్యం)
…………………………………………………….
హైదరాబాద్ మస్జిదు కూల్చివేత: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో మంగళవారం మున్సిపల్ అధికారులు మస్జిదు కూల్చడంతో నిరసనలు చెలరేగాయి. గ్రీన్ ఎవెన్యూ కాలనీలోని మస్జిదె ఖాజా మహమూద్‌ను భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది తెల్లవారుజామున కూల్చివేశారు.
ఈ ఘటనపై స్థానిక ముస్లింలు, వివిధ పార్టీల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
MBT నాయకుడు అంజెదుల్లా ఖాన్ మాట్లాడుతూ ఈ మస్జిదు మూడేళ్ల క్రితం నిర్మించబడిందని, శుక్రవారం ప్రార్థనలతో సహా ప్రతిరోజూ ఐదుసార్లు నమాజ్ క్రమం తప్పకుండా జరుగుతోందని అన్నారు.
15 ఎకరాల స్థలంలో గ్రీన్ ఎవెన్యూ కాలనీని శంషాబాద్ గ్రామపంచాయతీ నుంచి పూర్తి అనుమతితో ప్లాట్లు చేసి విక్రయించారని ఆయన దృష్టికి తెచ్చారు. 250 చదరపు గజాల రెండు ప్లాట్లు మస్జిదు కోసం ఒక స్థలంగా గుర్తించబడ్డాయి.
మస్జిదు పొరుగున ఉన్న ఒక వ్యక్తి మరికొందరు నివాసితులతో కలిసి మస్జిదు నిర్మాణానికి వ్యతిరేకంగా శంషాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కేసు కోర్టులో ఉన్నప్పటికీ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారని ఎంబిటి నాయకుడు అన్నారు.
ఏఐఎంఐఎం స్థానిక నేతలు కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించారు. మస్జిదు కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మస్జిదు వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
కూల్చివేతలను ముస్లిం నాయకులు ఖండించారు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వాన్ని కోరారు.