October 5, 2024

ప్రముఖ ఇస్లాంవాద రచయిత్రి శ్రీమతి షేక్‌ ఖుర్షీద్‌ బేగం రాసిన అబాబీలు కవితా సంపుటి ‘‘మేఘ గర్జన’’ పుస్తకాన్ని నవంబర్‌ 5, 2023 ఆదివారం నాడు గుంటూరులోని జమాత్‌ ఇస్లామి హింద్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ముస్లిం రచయితల ఆధ్వర్యంలో ప్రముఖ కవి భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముస్లిం రచయితల వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు ప్రఖ్యాత ఇస్లాంవాద కవి శ్రీ కరిముల్లా అధ్యక్షత వహించారు. మనువాదం మీద, మతతత్వం మీద, ఫాసిస్టు శక్తుల మీద ఖుర్షీద్‌ బేగం గారు రాసిన మేఘ గర్జన ధీటైన సమాధానం అని చెప్పారు. సమాజంలోని అన్ని రుగ్మతలను రచయిత్రి తన కలం ద్వారా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన రచనలు నేటి సమాజంలో అవసరం అని చెప్పారు. రచయిత్రి ఖుర్షీద్‌ బేగం మాట్లాడుతూ, ఇస్లాం మీద అనుమానాలు, అపోహలు దూరం చేస్తూ సమాజంలో జరిగే ప్రతి అనైతికతను, అన్యాయం, మతతత్వాలను ప్రశ్నించడమే రచయిత్రిగా తన బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి భూసురపల్లి వెంకటేశ్వర్లు, ప్రముఖ రచయిత్రి నల్లూరి రుక్మిణి, ప్రముఖ కవి కరిముల్లా, మురసం అధ్యక్షులు హకీమ్‌, రషీద్‌, బషీర్‌, సుభాని, జాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.