ఇజ్రాయెల్ దళాలు గాజా నగరం వైపు చొచ్చుకుపోతు న్నాయి. ఈ దాడుల్లో పాలస్తీనీయుల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాలస్తీనా మరణాల సంఖ్య తాజా అంచనాల ప్రకారం 12,000 దాటింది. us సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మానవీయ కాల్పుల విరమణకు ఇచ్చిన పిలుపును ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ బంధీలను విడుదల చేయకపోతే సైనిక కార్యకలాపాలలో విరామం ఇచ్చేది లేదన్నాడు. ఇజ్రాయెల్ గాజాపై ముఖ్యంగా గాజా నగరం చుట్టూ వైమానిక దాడులను కొనసాగించింది. నవంబర్ 3, 2023న తేదీన గాజా నగరంపై కొనసాగుతున్న వైమానిక బాంబు దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న సుమారు 3,000 మంది పాలస్తీనియన్ల జీవనోపాధి దెబ్బ తిన్నది. నవంబర్ 4న గాజా నగరానికి సమీపంలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు వరుసగా రెండో రోజు కూడా జరిగాయి. ఈ శిబిరం గాజాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం. అంతకుముందు రోజు, మంగళ వారం నాడు జరిగిన వైమానిక దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించారు, 150 మందికి పైగా గాయపడ్డారు.
గాజాలో తీవ్రమైన మనావీయ సంక్షోభం నెలకొంది. ఈ శిబిరంలోని ఉగ్రవాద కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. పాలస్తీనా సాధారణ ప్రజలు మరణించారని హమాస్ పేర్కొంది. దాడి తర్వాత సహాయ సిబ్బంది శిథిలాల నుంచి బాధితులను, మృతదేహా లను వెలికి తీస్తున్న భయంకర దృశ్యాలు ప్రపంచం చూసింది. జబాలియా శరణార్థి శిబిరంపై భారీ వైమానిక దాడులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధలంలో తలెత్తిన తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని చాటి చెబుతున్నాయి. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా ప్రతిస్పందన వినిపిం చింది. గాజాలోని షాతీ శరణార్థుల శిబిరం (దీనిని బీచ్ క్యాంప్ అని కూడా పిలుస్తారు)పై జరిగిన దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 2,700 మంది గాయపడ్డారు. ఈ దాడులు పాలస్తీనా సాధారణ ప్రజలపై జరుగుతున్న అమానుష దాడులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కాగా ఇస్రాయీల్ ఈ దాడులను సమర్థించుకోడానికి హమాస్ పౌరులను మానవ కవచాలుగా వాడుతుందన్న వాదన వినిపిస్తోంది. హమాస్ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సైనికసామాగ్రి, ఆయుధాలు దాచి పెడు తుందని, ఆ విధంగా మహిళలు, పిల్లలతో సహా పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిం చింది. ఈ ఆరోపణల ద్వారా సాధారణ ప్రజలను చంపడాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందనే వాదనపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. అనేక విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ వాదనలో ప్రధానమైన నాలుగు లోపాలేమిటంటే, ఒకటి – ఇస్రాయీల్ చెబుతున్నట్లు హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లేవు. యుద్ధ ప్రాంతంలో పరిశీలకులు ప్రవేశించే అనుమతులు లేవు. కాబట్టి ఈ వాదనను ధృవీకరించడం సాధ్యం కాదు. ఈ ధృవీకరణ లేకుండా ఇస్రాయీల్ చెబుతున్న మాటలను నమ్మలేం. రెండవ కారణం, ఇస్రాయీల్ అత్యధిక బల ప్రయోగానికి పూనుకుంటోంది. హమాస్ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందా లేదా అన్నది పక్కన పెట్టినా, ఇజ్రాయెల్ బలప్రయోగం అత్యధిక స్థాయిలో ఉంది. ఇలాంటి సైనిక చర్యల్లో సాధారణ పౌరులు అత్యధికంగా మరణిస్తారని నిపుణులు వాదిస్తున్నారు. అంతర్జాతీయ చట్టం సైనికచర్యల్లో బలప్రయోగం పరిమితికి మించడం కుదరదు. కాని ఇస్రాయీల్ గాజాలో చేస్తున్నది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అంటున్నారు పరిశీలకులు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధం చేస్తున్న సైనికులు, సాధారణ పౌరుల మధ్య తేడాను సైనికదళాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ ఈ సూత్రాన్ని పాటించడంలో విఫలమైందని, ఫలితంగా పౌరులు మరణించారని విమర్శకులు పేర్కొన్నారు. పౌర మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇస్రాయీల్ వైఫల్యాన్ని, అంతర్జాతీయ చట్టాల పట్ల నిర్లక్ష్యాన్ని సూచి స్తుంది. పౌర ప్రాణనష్టాలకు జవాబుదారీతనం లేకపోవడం కూడా ఈ యుద్దంలో కనబడుతుంది. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఇజ్రాయెల్ వాదనలకు చట్టబద్ధత లేదని, ఇస్రాయీల్ వాదనలో డొల్లతనాన్ని ఇవి సూచిస్తున్నాయని చాలా మంది వాదిస్తున్నారు. కాగా మరోవైపు ఇజ్రాయెల్ భూ బలగాలు ఉత్తర గాజాలో కార్యకలాపాలను కొనసాగిం చాయి. నవంబర్ 3న వైద్యసహాయ బృందంపై జరిగిన దాడిలో కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఖచీ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిరచారు. నవంబర్ 3న పాఠశాల లపై, ఆసుపత్రులపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 35 మంది మరణించారు. ఇస్రాయీల్ దాడుల్లో సాధారణ పౌరులు ఎలా లక్ష్యమవుతున్నారో ఈ దాడులు చెబుతు న్నాయి. కనీసం ఆరోగ్యవైద్య బృందాలను కూడా వదలకుండా దాడులు చేయడం జరుగుతోంది. మరోవైపు ఖూ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ టెల్ అవీవ్ మూడవసారి పర్యటించారు. నవంబర్ 3న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. జోర్డాన్‌లో అరబ్ నాయకులతో బ్లింకెన్ కాల్పుల విరమణ గురించి చర్చించబోతున్నారు. నవంబర్ 3న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా పాలస్తీనా గురించి మాట్లాడారు. ఖూ ప్రమేయాన్ని విమర్శించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన చేసిన తన మొదటి ప్రసంగంలో అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడిని ప్రశంసించారు. హిజ్బుల్లా వైఖరి ఈ ప్రాంతంలో మరింత జటిల సమస్యలకు దారితీస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్ పై దాడులు ప్రారంభించింది. కనీసం 41 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నారు. నబ్లస్, జెనిన్, హెబ్రాన్, బెత్లెహెం వంటి పట్టణాలలో 143 మంది కంటే ఎక్కువ మంది పాలస్తీనీయులు మరణించారు.