అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 145 మంది ముస్లిం అమెరికన్లు పోటీపడ్డారు. స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ స్థాయి హోదాలకుపోటీ చేసిన వారిలో చాలా మంది విజయాలు సాధించారు.
ఫెడరల్ స్థాయిలో ప్రతినిధుల సభలో ఆంద్రె కార్సన్, ఇల్హాన్ ఉమర్, రాషిదా లాయిబ్ లు విజయాలు సాధించారు. అమెరికా కాంగ్రెసుకు ఎన్నికైన మొదటి ముస్లిం కీత్ ఎలిసన్ మిన్నెసోటా అటార్నీ జనరల్ గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
రాష్ట్రస్థాయిలో అధికార సభ్యుల్లో 29 మంది తమ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొదటి ముస్లింలు. ఇందులో కొందరు మరోసారి ఎన్నికైన వారు. వీరిలో డెలావేర్ రాష్ట్ర ప్రతినిధి మదీనా విల్సన్-ఆంటోన్, కొలరాడో రాష్ట్ర ప్రతినిధి ఇమాన్ జోడే, కొలరాడో రాష్ట్ర సెనేటర్ సౌద్ అన్వర్ ఉన్నారు.
జార్జియాలో, ప్రస్తుత రాష్ట్ర సెనేటర్ షేక్ రెహమాన్ శాసనసభలో ఇంతవరకు ఒకే ఒక్క ముస్లింగా ఉండేవారు. ఇప్పుడు ఆయనతో పాటు ఇద్దరు ముస్లిం మహిళలు గెలిచారు.
జిల్లా 7కి రాష్ట్ర సెనేటర్‌గా నబిలా ఇస్లాం ఎన్నికయ్యారు. రువా రోమ్మాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డిస్ట్రిక్ట్ 97కి గెలిచారు.
టెక్సాస్ లో మొదటి ముస్లిం రాష్ట్ర శాసనసభ్యులు, సులేమాన్ లలానీ, సల్మాన్ భోజానీలు ఎన్నికయ్యారు. భోజనీ రిపబ్లికన్ నియంత్రణ నుండి తన జిల్లాను తిప్పికొట్టారు.
మైనేలో కూడా ముస్లిములు చరిత్ర సృష్టించారు. మొదటి ఇద్దరు సోమాలి అమెరికన్లను మైనే రాష్ట్ర రాజధానికి పంపింది. మనా అబ్ది ప్రత్యర్థి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ముస్లింలు “పబ్లిక్ ఆఫీసులో ఉండకూడదు” అని ఒకసారి పోస్ట్ చేసారు. కాని తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పోటీ లేకుండా గెలిచారు.
2022 మధ్యంతర ఎన్నికలు సోమాలి అమెరికన్‌లకు కలిసి వచ్చాయి, జైనాబ్ మొహమ్మద్ మిన్నెసోటాలో గెలిచి మొదటి ముస్లిం మహిళగా, మొదటి సోమాలి మహిళగా రాష్ట్ర సెనేట్‌లో పనిచేస్తున్న మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు.
ఒహియోలోని 26 ఏళ్ల మునిరా అబ్దుల్లాహి తన రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటి ముస్లిం మహిళగా మారిన మరో సోమాలి అమెరికన్.