October 5, 2024

జోర్డాన్ లో జరుగుతున్న ఆసియా ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ ముహమ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల 57 కిలోల విభాగం సెమీఫైనల్ చేరడం ద్వారా అతను ఈ పతకం సోంతం చేసుకోగలిగాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్ లో హుస్సామ్ కుడి కంటి పైభాగంలో గాయం అవ్యడంతో అతను సెమీఫైనల్ కు గైర్హాజరయ్యాడు. అతని ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చేశాడు. హుస్సామ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు ఫైనల్ కి చేరుకోవడం విశేషం. పురుషుల 63.5 కిలోల విభాగంలో పోటీ పడుతున్న స్టార్ బాక్సర్ శివ థాపా రికార్డు స్థాయిలో ఆరో పతకం ఖాయం చేసుకున్నాడు. సెమీఫైనల్లో అతను 4-1తో బకోదుర్‌ ఉస్మానోవ్‌ (తజకిస్తాన్‌)పై నెగ్గాడు. పురుషుల 48 కిలోల సెమీస్‌లో గోవింద్‌ 0ఉ4తో సాంజర్‌ తాష్కెన్‌బే (కజకిస్తాన్‌) చేతిలో, 75 కిలోల విభాగంలో సుమిత్‌ 5తో జఫరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడి కాంస్య పతకాలతో తిరిగొచ్చారు.