April 13, 2024

బాలల దినోత్సవం సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ కేంద్ర విద్యా బోర్డు (ఎడ్యుకేషన్ బోర్డ్, మర్కజీ తాలీమీ బోర్డ్) చైర్మన్ ముజ్తబా ఫరూక్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఒక సందేశంలో, మర్కజీ తాలీమీ బోర్డు (MTB) చైర్మన్, “నవంబర్ 14, 1948 నుండి బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ప్రస్తుతం దేశంలో పిల్లల పరిస్థితి గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలే జాతి సంపద‘‘ అన్నారు. దేశంలోని మొత్తం జనాభాలో పిల్లలు ఐదవ వంతు ఉన్నారు. బాలలదినోత్సవం నిజంగా అర్థవంతంగా జరగాలంటే పిల్లల పట్ల అందరూ శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా కొన్ని ప్రధాన సమస్యలను ప్రస్తావించుకోవాలన్నారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, పిల్లల విద్య తదితర సమస్యలపై అందరూ పనిచేయవలసిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.  ఆయన, పోషకాహార లోపం, ఎదుగుదల స్తంభించడం, శిశు మరణాల సమస్యలను పరిష్కరించాలని నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానంలో 2030 నాటికి బాల్య సంరక్షణ బాలల విద్య (ECCE)ని విశ్వవ్యాప్తం అందరికీ అందేలా చేయాలని నొక్కిచెప్పినప్పటికీ, ఎక్కువ శాతం మంది పిల్లలకు అంగన్వాడీలు అందుబాటులో లేవని, అలాగే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు కూడా అందుబాటులో లేవని అన్నారు.

ప్రస్తుత 2022-23 బడ్జెటులో  2.35% శాతం పిల్లల సంక్షేమానికి, పోషకాహారం, ఆరోగ్యం, విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి సరిపోదని ఆయన అన్నారు.