October 5, 2024

మహిళలకు మంచి నగరాలు

చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. చాలా మంది మిత్రులతో కలిసి, కుటుంబంతో, బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. కాని కొందరు ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటారు. కాని ఒంటరి ప్రయాణీకులకు భద్రత సమస్య ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భద్రత ముఖ్యమైన సమస్యగా మారుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒంటరి మహిళల ప్రయాణభద్రత గురించి ఇంటర్నెట్ లో వెదకడం 99శాతం పెరిగిందని ట్రావెల్ సంస్థ ఇన్ సెక్యుర్ మై ట్రిప్ డాట్ కామ్ తెలిపింది. కాండోర్ ఫెర్రీస్ అనే సంస్థ పరిశోధన ప్రకారం ఒంటరిగా ప్రయాణాలు చేసేవారిలో 84 శాతం మహిళలే ఉన్నారు. ముఖ్యంగా అమెరికా మహిళలు 72 శాతం మంది ఒంటరిగా ప్రయాణాలు చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇన్ సెక్యూర్ మై ట్రిప్ ట్రావెల్ సంస్థ ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు సురక్షితమైన నగరాలేవో సర్వే చేసింది. ప్రపంచంలోని 65 నగరాల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం తెలిసిన వాస్తవాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గొప్పగా చెప్పుకునే పాశ్చాత్యదేశాల కన్నా అరబ్బు దేశాలు ఈ విషయంలో మిన్నగా ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణాలు చేసే మహిళలకు సురక్షితమైన నగరాల జాబితా ఈ సర్వే ప్రకారం తయారు చేశారు. ఆ జాబితాలో అన్నింటికన్నా పై భాగాన ఉన్న నగరం దుబాయ్. దుబాయ్ మొత్తం 8.12 పాయింట్లు సాధించింది. గత సంవత్సరం దుబాయ్ స్కోరు 7 పాయింట్లు మాత్రమే. స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరం మూడవస్థానంలో 7.79 పాయింట్లు నమోదు చేసింది. గత సంవత్సరం 60వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా నగరం రియాద్ ఈ సంవత్సరం 24వ స్థానానికి చేరుకుంది. సౌదీ అరేబియాలోని మదీనా నగరం 7వ స్థానంలో ఉంది. ఫ్రాన్సులోని పారిస్ నగరం 57వ స్థానంలో ఉంది. డాటా ప్రకారం సౌదీ అరేబియాలోని మదీనా నగరం అర్థరాత్రి కూడా ఒంటరి మహిళ సురక్షితంగా నడిచే నగరంగా గుర్తింపు పొందింది. స్త్రీలపై దాడులు జరిగే అవకాశాలు మదీనాలో చాలా తక్కువని సర్వేలో తెలిసింది. మహిళలకు సురక్షితమైన నగరాల జాబితాలో రెండవ స్థానంలో ధాయిలాండ్ కు చెందిన చియాంగ్ మాయ్ నగరం ఉంటే మూడవస్థానంలో మరో అరబ్బు నగరం దుబాయ్ ఉంది. మహిళలకు భద్రత అస్సలు లేని నగరాల జాబితాలుగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్, మలేషియాలోని కౌలాలంపూర్ ముద్రపడ్డాయి. మూడవస్థానంలో పారిస్ ఉంది. టూరిజం విషయంలో చూస్తే దుబాయ్ మొదటి స్థానానికి చేరుకుంది. రెండవ స్థానంలో న్యూయార్క్ ఉంది. ప్రయాణ ఖర్చులు చాలా తక్కువగా ఉన్న నగరాలను చూస్తే మొదటిస్థానంలో జైపూర్ నగరం, రెండవ స్థానంలో చెన్నై నగరం ఉన్నాయి.  మూడవ స్థానంలో టర్కీలోని అంటాలియా నగరం ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కూడా మహిళలకు సురక్షితమైన నగరం దుబాయ్. ఈ నగరాన్ని సందర్శించిన అనేకమంది అభిప్రాయం కూడా ఇదే. ఏది ఏమైనా మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో దుబాయ్, మదీనా, రియాద్ వంటి అరబ్బు నగరాలు గొప్ప ర్యాంకును సాధించుకోవడం ఇస్లామ్ లో మహిళల స్థానం గురించి విమర్శలు చేసేవారికి ఒక జవాబుగా భావించవచ్చు.