‘‘కమసలిలల్ హిమారి యహ్మిలు అస్ఫారా ` ఆచరణా శూన్యమైన చదువులు వల్లె వేసేవాడు పుస్తకాలను మోసే గాడిదకు సైదోడు’’ అని చెప్పిన విజ్ఞాన ఖని ప్రవక్త శిఖామణి (స). ‘‘కబుర మఖ్‌తన్ ఇందల్లాహి అన్ తఖూలూ మాలా తఫ్‌అలూన్’’ ` చెప్పే నీతులు పాటించకపోవడం అన్నది దైవానికి కోపం తెప్పించే ప్రక్రియ అని హెచ్చరిస్తూనే, ధనాన్ని తృణీకరించమని ధర్మశాసనాలు వల్లించే ధన స్వాములున్నారు జాగ్రత్త! అని జగతిని జాగరూక పరచిన సత్యోపదేశ స్థితప్రజ్ఞులు ముహమ్మద్(స).
‘‘అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ ఇల్మిల్ లా యన్‌ఫవు’’ ` ‘‘దూరంగా ఉంచు ప్రభూ! భక్తీప్రపత్తులు కరువైన హృదయం నుంచి. మానవత్వం మరణించిన మనస్సు నుంచి, చిరునవ్వెరు గని నైరాశ్యం నుంచి, పిల్లల్ని ప్రేమించని అహం నుంచి, పెద్దల్ని గౌరవించని అవిధేయత నుంచి’’ అన్న ప్రార్థనా పలుకులతో నైతిక విలువల్ని నూరిపోసిన నవయుగ వైతాళికులు ప్రవక్త (స).
‘పైపై పశ్చాత్తాపంతో, ఉత్తుత్తి కన్నీళ్ళతో పాపాలు పోవు. పవిత్ర హృదయంతో, నిర్మల మనస్సుతో ప్రభువును వేడుకునే క్షమాభిక్ష వల్లనే పాప ప్రక్షాళనం జరుగుతుంది’ అన్నది ఆయన చెప్పిన మాటే. ‘తాత్కాలికంగా తళుక్కుమని, తర్వాత చతికిలబడే అమిత కార్యాచరణకన్నా ` నిరంతరం నిత్య చైతన్యరూపంలో అలరారే, గల గల పారే భక్తి ప్రవాహమే మిన్న’ అన్న మాట ఆయన నోట జాలువారినదే. ‘దైవకీర్తన చేయనివాళ్లు జీవచ్ఛవాలు, దైవ సంకీర్తనం ఆలాపించేవాళ్లు నిత్య చైతన్యవ్రతులు’ అన్న ఉప మానం ఆయన ఇచ్చినదే. ‘మీరు ధర్మాత్ములుగా రూపొంది ప్రజల పట్ల నిరపేక్షతో ఉంటే, అందరి హృదయ బంధువులవు తారు. మీరు కరుణాత్ములుగా మసలితే దైవ కటాక్షానికి పాత్రు లవుతారు’ అన్న మహితోక్తిని చెప్పిన వారు మహాప్రవక్త ముహమ్మద్ (స).
మహాప్రవక్త ముహమ్మద్ (స) వారిది మధుర ధ్వని. అగ్రజుల వారిది సువ్యక్త సముదాత్త రసావేశ సత్యస్వర ధుని. సంఘ సంస్కర్త పండితాగ్రేసర ప్రవక్తలందరి నాయకమన్యులు ముహమ్మద్ (స). ఆయన అమృత పలుకుల్లో దివ్యావిష్కృతి సాక్షాత్కరించింది. సత్యసంధత సంపెంగలు, దయార్ద్రత దానిమ్మ మొగ్గలు, మమతల మొగలి పూరేకులు, వాత్సల్య వేపపూలు, సాత్వికత సన్నజాజులు, ప్రేమ పారిజాతాలు, అనురాగ అడవి మల్లెలు, సుగుణాల గులాబీలు, గుల్ మొహర్లు విలక్షణ రేఖల్లో, రూపాల్లో ఆయనలో ఘనీభవించాయి. ఆయనలో ప్రకృతి సౌందర్య సుకుమార సుమ దర్శనమూ ఉంది. పరలోక పరిచింతన పరిమళమూ ఉంది. ఆయన మాటలు అక్షరాలా పోతపోసుకున్న దివ్యా విష్కృతి మూటలు, సత్యధర్మ సురుచిర మందహాసాలు. సత్యగ్రంథ సుందర సూక్తుల సుమనోహర చంద్రహాసాలు. అవి ముత్యాలు పొదిగిన హారం వలె రసరమ్యంగా, అందంగా, అతి సౌమ్యంగా జాలువారు తుంటాయి. సత్యవాక్కుల సెలయేటి నీటి వలె గలగలా పారుతూ ఉంటాయి ` సత్యశోధక పురుషోత్తముల వైపు, సత్య పిపాస కమనీయ కరుణధ్యేయ హృదయాల వైపు.
దివ్య గ్రంథాల సారాంశ మకరందాన్ని రసీకరించుకున్న రసూల్‌గా, మానవాత్మ ధాత్రిని షిర్క్ నుండి విముక్తం చేసి, తౌహీద్ తన్మయ తరంగాలలో ఓలలాడిరచిన మానవ మహోపకారిగా, తన పసిడి పలుకే మేలుకొల్పుగా మనుజ జాతిని నడిపించిన వక్తృత్వమూర్తిగా, వారథిగా, రధసారథిగా ముహమ్మద్ (స) వారి వ్యక్తిత్వం మానవాళికి మచ్చుతునక, మానవత్వానికే తలమానికం. అందుకే ఆ సుగుణాగ్రజుణ్ణి జీవితపు అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా పేర్కొన్నాడు అల్లాప్‌ా. ‘‘నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీల శిఖరాధిరోహుడవు` మహాగ్ర సౌశీల్యవంతుడవు’’ (అల్ ఖలమ్ : 4). ‘‘నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు ఉత్తమ ఆదర్శం ఉంది’’ (అల్ అహ్జాబ్ : 21).
ఆయన (స) ప్రజల కోసం పుట్టి, ప్రజల కోసం పెరిగి, విశ్వశాంతి కోసం పాటుపడుతూ జీవించారు. అది చూసి అల్లాహ్ ఇలా అన్నాడు: ‘‘(ఓ ముహమ్మద్!) ఒకవేళ జనులు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమీ?’’ (అల్ కహఫ్ : 6).
తలపై మిలమిలలాడే పచ్చని తలపాగ, తళతళ మెరిసే కుండల పాశము. చెక్కిళ్ళపై జీరాడే నీలాల ముంగురులు. అందమైన అంగ సౌష్టవం, సుందర దేహంతో మదీనాలో ప్రవేశిస్తుండగా ఆ పుర ప్రజలు పరుగులిడిరి అభిమానం ముసురుకోగా!
అది మదీనా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మహోజ్వలమైన రోజు. నగర వాడవాడల్లో, వీధుల్లో దైవ సంకీర్తనలు మిన్నంటుతున్నాయి. అన్సార్ బాలికలు సంతోషాతిరేకంతో గేయాలాపనలు చేస్తున్నారు …
‘‘మాపై నిండు చందురుడు ఉదయించాడు
‘వదా’ పర్వత శిఖరాల మధ్య నుండి
అభివందనాలు, దైవానికి ధన్యవాదాలు మాపై తప్పనిసరి
ప్రార్ధించేవారు అల్లాప్‌ాను ప్రార్ధించగా
మాలో ప్రభవించిన ఓ పూర్ణ చంద్రమా! పురుషోత్తమా!
నీ అమృత ప్రవచనాలే మాకు వీనుల విందు!’’
హయా