May 17, 2024
ప్రవక్తలకు నాయకుడయిన ఈ మహావ్యక్తి జననమొందిన నాటి నుంచీ మానవ జాతికే ఒక అపురూపమయిన ఆదర్శప్రాయు డుగా నిలిచి జీవితం గడిపారు.
ఎందరో మహనీయులు తమ జీవితారంభంలో, యవ్వన దశలో విశృంఖలంగా, అల్లరిచిల్లరగా ప్రవర్తించినట్లు చరిత్రకారులు చెపుతుంటారు.
బాల్యం నుంచే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసిన మరునాటి నుంచే` ఆగ్రహంతో అరవటంగాని, అన్యాయానికి తలవంచటం గాని చెయ్యని అపురూపమయిన జీవితం గడిపినవారు ఈ మానవతామూర్తి ఒక్కరే.
అబూ తాలిబ్‌ అన్న పేరు గల వీరి పెత్తండ్రి ధనధాన్యాదులు గల సంపన్నులు కారు` బీదవాడు.
అటువంటి బీద వ్యక్తి తమని ఆదరించి, పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతా భావం అగ్రజునికి ఎప్పుడూ ఉన్నది. పెత్తండ్రి ప్రాపుతో పెరిగి పెద్దవాడినయ్యానన్న విషయం ఆయన ఏనాడూ మర్చిపోలేదు.
అందుచేత పెత్తండ్రికి తాము భారమై ఉండరాదు`అన్న ఉద్దే శ్యంతో ఈ మహా మనీషి కూలికోసం మేకలనీ, గొడ్లనీ మేపే పశువుల కాపరి వృత్తి చేపట్టారు.
పురుషోత్తమా!
యావత్‌ ప్రపంచానికి ఉత్తమ మార్గం చూపించ వచ్చినవాడా!
అరబ్బులకి విజ్ఞాన వివేచనా మార్గం ప్రబోధించ వచ్చినవాడా!
రాజాధిరాజా!
అసంఖ్యాకమయిన` సైనిక వాహిని గల రోమన్‌ సామ్రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకున్నవాడా!
అంతులేని ధనరాసులు, వజ్ర వైఢూర్యాలు, వెండి బంగారాలపై నడిచే ముస్లిమ్‌ రాజ్యాన్ని స్థాపించిన మహానుభావా!
మీరు బాల్యంలోనే` గొర్రెల్ని మేపుతూ, కుటుంబ భారాన్ని మీ భుజాలపై వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు` కన్నీళ్ళు చిందుతున్నాయి!
ఇటువంటి అపురూప వ్యక్తిని ప్రవక్తగా, నాయకునిగా పొందటా నికి ముస్లిమ్‌ ప్రజ ఎంత అదృష్టం చేసుకున్నారో గదా!
ఒక్క పశువుల కాపరిగా మటుకేనా? తను ఎవరికి భారం కాకూడ దన్న ఉద్దేశ్యంతో పన్నెండేళ్ళు నిండకమునుపే… స్వదేశం వదలి, పరాయి దేశానికి వర్తకానికై వెళుతున్న పెత్తండ్రి వెంట వెళ్ళారు` ఆయనకి సహాయకునిగా.
తన ఇంట్లోని బంధువులకే కాదు, కదలలేని వృద్ధులు, నిరాధారు లయిన బీదవారి ఇళ్ళకు వెళ్ళేవారు.
‘‘నేను అంగడి వీధికి వెళుతున్నాను. మీకేదయినా కావాలా? సరుకులు తెచ్చి పెట్టమంటారా?’’ అని పని మీద బయటికి వెళ్ళే ముందు అడిగేవారు.
వారివద్దనున్న సరుకులు తీసుకెళ్ళి, అమ్మి, తిరిగి వస్తూ బరువైన మూటలు మోయటానికి అలవిగాని, అతి భారమయిన మూటలు మోసుకొచ్చి ఈ వృద్ధ మాతలకి ఇస్తూ ఉండేవారు.
ఆడి తప్పని ఈ సత్యసంధుడు` ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టు కునేవారో, సత్యవాక్కుకి ఎటువంటి అపూర్వమయిన విలువ నిచ్చేవారో ఉదాహరణగా ఒక సంఘటన ఇది`
ఒక స్నేహితుడు` ‘‘మీరు ఆ వీధిలో ఆ అంగడి పక్కన నుల్చుని ఉండండి` నేను వచ్చి కలుసుకుంటాను’’ అన్నారట.
అగ్రజులు ఆ స్నేహితుడు నిర్దేశించిన స్థలంలో నుల్చున్నారు.
ఒకరోజు గడిచింది.
రెండో రోజు కూడా వెళ్ళిపోయింది.
మూడో నాడు కూడా గడిచిపోతూ ఉంది.
అదే చోటున అగ్రజులు నుల్చుని ఉన్నారు.
ఆయనని అక్కడ నుల్చోమని చెప్పిన విషయం ఆ అవతల వ్యక్తి మర్చిపోయారు. అనుకోకుండా ఆ దారి వెంట గబగబా నడిచివస్తున్న ఆ మిత్రుడు, నడుస్తూ నడుస్తూ కొట్టు పక్కన నుల్చుని ఉన్న ఈయన్ని చూసి ఆశ్చర్యపోయి`
‘‘అరే` మీరిక్కడే నిల్చుని ఉన్నారా?’’ అని సిగ్గుపడుతూ అడగ్గా… ఈషణ్‌ మాత్రం కోపంగాని, విసుగు గాని ప్రదర్శించక చిరు నవ్వుతో ‘‘మీరే కదా ఇక్కడ నిల్చుని ఉండమన్నారు?’’ అని ప్రశ్నించారు ఆ సహనశీలి.
అందుచేతనే అమీన్‌(విశ్వసనీయుడు) అని, సాదిక్‌ (సత్య సంధుడు) అని ప్రేమపూరితంగా` ప్రజలు కొనియాడారు ఈ మహా వ్యక్తిని.
ఇటువంటి విశ్వసనీయుని, సత్యవంతుని భర్తగా స్వీకరించింది సంపన్నురాలయిన ఖదీజా.
అప్పటికే ఆమె ఇద్దరు భర్తలని కోల్పోయి, వితంతువుగా జీవితం గడుపుతూ ఉంది.
ఆమె అగ్రజునికంటే వయసులో పదిహేనేళ్ళు పెద్ద. ఆమె సౌశీల్యవతి, పవిత్రురాలు (తాహిరా) అని అందరిచేత గౌరవించ బడుతోంది. మూలుగుతున్న ధనరాసులకామె స్వంతదారు.
వయసులో పెద్దదైన ఖదీజా అగ్రజుని పాణిని గ్రహించి ఆయన జీవిత భాగస్వామిగా`
కాసిమ్‌, అబ్దుల్లాప్‌ా (తాహిర్‌), జైనబ్‌, రుకియా, ఉమ్ము కుల్‌సూమ్‌, ఫాతిమా` అనే ఆరుగురు సంతానానికి జన్మనిచ్చారు. ఈ ఆరుగురిలో మొదటి ఇద్దరు మగపిల్లలూ బాల్యంలోనే మృత్యు వాత పడ్డారు.
ఈ వివాహం చేత అగ్రజులు వర్తక వ్యాపారాలలో నిలదొక్కు కోటానికి` కొంత అవకాశం చిక్కిందని చెప్పుకోవాలి.
చిరకాలంగా ఆయన మనసులో ఉన్న సన్మార్గ నడవడికలో పయనించవలెనన్న కోర్కె ఫలించటానికి ఈ వివాహం కొంత దోహదపడిరది.
గృహస్థుగా ఉండి, సంసార జీవితం గడుపుతూ కూడా, నూతన మార్గమున పయనించి, సందేశ ప్రబోధము చేసినవారు ముహమ్మద్‌ ప్రవక్త ఒక్కరే.
గౌతమ బుద్ధుడు : ఒక రాజ్య పరిత్యాగి.
శంకరాచార్యులు : పెండ్లికాని బ్రహ్మచారి.
ఏసు క్రీస్తు : పెండ్లికాని వారు.
తీర్థంకరుడు : సర్వసంగ పరిత్యాగి.
మత గురువులు, కొత్త మార్గాన పయనించే ప్రబోధకులు, వీరిలో ఎక్కువ భాగం సర్వసంగ పరిత్యాగులో, పెళ్ళి చేసుకోని బ్రహ్మచారులుగానో అయి వుంటారు.
కాని, అగ్రజులు ఒక్కరే లౌకికమయిన గృహస్థు జీవితం గడిపారు. ఇంకా చెప్పాలంటే` బహు భార్యలు, పలు వివాహాలని ప్రబోధించి, అనుమతించిన మత మార్గానికి నాయకులయి ఉండి కూడా సపత్నీ వ్రతాన్ని చేపట్టిన పవిత్ర మూర్తి ఈయన.
అమీన్‌ అనీ, సాదిక్‌ అని ప్రశంసించబడిన ఈ మహోన్నత మూర్తి` కొత్త మార్గం గూర్చి బోధించటం మొదలు పెట్టేసరికి, అప్పటిదాకా ఆయనని మెచ్చుకున్న యావన్మందీ ఆయనని ప్రతిఘటించి, దూషించటం మొదలుపెట్టారు.
ఎందుకని? మానవ చరిత్రలో ఇంతవరకూ ఏ విప్లవ నాయకుడూ చెప్పని విషయం ఒకటి` తల్చుకుంటేనే హృదయం కంపించి పోయేటటువంటి విషయం ఒకటి` ఈ మహా వ్యక్తి ప్రస్తావిం చటం ఆరంభించారు.

అడియార్