December 3, 2024

అబ్బా జీ. అస్సలాము అలైకుం.
వ అలైకుముస్సలాం బేటా.
‘నన్ను మరచి పోయావు కదూ?’
లేదు బేటా. ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో నీవు గుర్తుకు వస్తూనే ఉంటావు. నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉంటాయి.
ఇంత చిన్న వయసులో మమ్మల్ని వీడి వెళ్లిపోయానని ఇంటిల్లిపాది ఏడుస్తుంటే, నువ్వు మాత్రం చాలా సంతోషించావు కదూ.
అవును బేటీ. కన్న తండ్రిగా కన్నీళ్ళు కార్చినా. ఒక విశ్వాసిగా చాలా సంతోష పడ్డాను. ఎందుకో తెలుసా? ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. ఇక్కడ చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ మాయా ప్రపంచంలో ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంతగా సమాధానం చెప్పుకోవాలి. నా కూతురు చాలా అదృష్టవంతు రాలు. చిన్న వయసులోనే ఈ మాయా ప్రపంచాన్ని వీడి వెళ్ళి పోయి లెక్కా పత్రం నుంచి కాస్తయినా తప్పించుకుంది అని సంతోషించాను.
మరి నువ్వు ప్రతి రోజూ నా దగ్గరకు వచ్చి ఏడుస్తావు ఎందుకు?
ప్రవక్త ముహమ్మద్‌ (స) అంతటివారే, తన కుమారుడు చనిపోయి నప్పుడు కన్నీళ్ళు కార్చడం చూసి ఓ ప్రవక్తా! మీరు కూడా ఏడుస్తున్నారా? అని అడుగగా,
‘‘కన్న కొడుకు లోకాన్ని విడిచి వెళ్ళిపోతే కన్నీళ్ళు కూడా కార్చని హృదయం పాషాణ హృదయం’’ అని అన్నారు.
నేను అతి బలహీనమైన విశ్వాసం కలవాడ్ని. కళ్ళ ముందే కన్న కూతురు వెళ్ళిపోతే, కన్నీళ్ళు కూడా కార్చకుండా ఎలా ఉండగలను తల్లి.
‘‘అబ్బాజీ ! ఒకటి చెప్పనా.’’
‘‘చెప్పు తల్లి.’’
‘నాన్నా! బతికి ఉన్న వాళ్ళు, చనిపోయిన మాలాంటి వాళ్ళను చూసైనా కళ్ళు తెరవరు ఎందుకు? మేము మీరు ఊహించని రీతిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాం.’
ప్రవక్త ముహమ్మద్‌ ( స) పద్నాలుగు శతాబ్దుల క్రితమే చెప్పారు కదా అమ్మ. చనిపోయిన ప్రతి ఒక్కరూ అరచి అరిచి చెబుతారట.
ఖుర్‌ఆన్‌లో సృష్టికర్త అయిన అల్లాప్‌ా చెప్పినది అక్షర సత్యంగా మేము చూస్తున్నాము. ఓ బంధుమిత్రులారా! మేలుకోండి. మరణానంతర జీవితం కోసం పుణ్యాలను సమకూర్చుకోండి అని.
కానీ ప్రాపంచిక మాయలో పడి మరణాన్ని మరచి జీవిస్తున్న వారికి ఈ మాటలు వినబడవు.
నిజమే నాన్న. నేను కూడా ఇలాగే అరిచాను. కానీ అక్కడ ఉన్న ఎవరికి కూడా ఏమీ వినబడినట్లు అనిపించింది.
ఎందుకంటే?
‘‘ప్రాపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప మరేమీ కాదు. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి, ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండిÑ ఆకాశాలంత, భూమియంత విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాప్‌ానూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారికొరకు సిద్ధం చేయ బడిరది. ఇది అల్లాప్‌ా అనుగ్రహం, తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు. అల్లాప్‌ా ఎంతో అనుగ్రహం కలవాడు. (57:21)
‘‘విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాప్‌ాకు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసు కోవాలి. అల్లాప్‌ాకు భయపడుతూ ఉండండి, నిశ్చయంగా అల్లాప్‌ాకు మీరు చేసే పనులన్నీ తెలుసు. అల్లాప్‌ాను మరచి పోయిన వారి మాదిరిగా మీరూ అయిపోకండి. (అల్లాప్‌ాను మరచిపోవటం వల్ల) అల్లాప్‌ా వారిని తమను తాము మరచి పోయేలా చేశాడు. వారే దుర్మార్గులు. నరకానికి పోయే వారూ స్వర్గానికి పోయేవారూ ఎన్నటికీ ఒకటి కాలేరు. అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు. (59 :18-20)
నిజమే నాన్న గారు. మరణం తర్వాత తెలుస్తోంది అసలు నిజం. కాని అప్పుడు తెలిసిరావడం వల్ల ప్రయోజనం లేదు కదా. అబ్బా జీ. నేను నిజంగా అదృష్టవంతురాలినే.
ఎందుకమ్మా!
కాస్తో కూస్తో దైవ ధర్మ ప్రచారం చేసే అవకాశం లభించింది.
ఖురాన్‌ చదివి కాస్తయినా ఆచరించే అవకాశం నాకు కలిగింది. నువ్వు రోజూ నా దగ్గరకు వచ్చి ఖుర్‌ఆన్‌ చదివి నాకోసం దుఆ చేస్తావు. అమ్మ రాత్రుళ్ళు నిద్ర లేచి నన్ను తలుచుకుంటూ ఏడ్వడం కాస్త బాధ కలుగుతుంది.
నా రూపంలో మీరు మనవరాలు మనహాను చూసుకుంటూ అది చేసే అల్లరి పనులు చూసి మురిసిపోవడం చూసి ఆనందం కలుగుతుంది.
నిజమైన ఇస్లామీయ మార్గంలో మనవరాలిని పెంచుతారని, అది చేసే పుణ్యకార్యాలలో నాకు, మీకు నరకాగ్ని నుంచి కాస్తైనా ఉపశమనం కలుగుతుందన్న ఆశ.
‘ఇన్షాల్లాప్‌ా . అలాగే అమ్మ. నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి రోజూ అదే దుఆ చేస్తున్నాను’`
అల్లాప్‌ా మా అందరి చేత నీ ధర్మ సంస్థాపనా కార్యం పనులు చేసి పరలోకంలో నరకం నుండి కాపాడు అని
అలాగే అబ్బా జీ. అల్లాప్‌ా మీ దుఆ స్వీకరించుగాక.
అమీన్‌ సుమ్మ అమీన్‌.
ఏంటి నిద్రలో కూడా అమీన్‌ అంటున్నారు. లేవండి స్కూల్‌కు వెళ్ళే టైం అవుతుంది.
ఒహ్! ఇదంతా కల నా. అనుకుంటూ కళ్ళు నలుపుకుంటూ మంచం మీద నుంచి లేచా.

 

అబ్దుల్ బాసిత్