November 21, 2024

వీగర్‌ ముస్లిం జనాభాపై చైనా విధానాలు చాలా కాలంగా అంతర్జాతీయ విమర్శకు గురవుతునే ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం ఆందోళన వెలిబుచ్చుతూనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. చైనా అమలు చేస్తున్న కఠిన మైన చర్యల వల్ల  ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల 50 లక్షల మంది కష్టాలపాలవుతున్నారు. వీగర్‌ ముస్లిములు ప్రధానంగా చైనాలోని జింగ్జియాంగ్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో నివసిస్తున్నారు. తీవ్రమైన మత, సాంస్కృతిక అణిచివేతకు గురవుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వీగర్‌ ముస్లిం జనాభాపై చైనా విధానాలు చాలా కాలంగా అంతర్జాతీయ విమర్శకు గురవుతునే ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం ఆందోళన వెలిబుచ్చుతూనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. చైనా అమలు చేస్తున్న కఠిన మైన చర్యల వల్ల  ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల 50 లక్షల మంది కష్టాలపాలవుతున్నారు. వీగర్‌ ముస్లిములు ప్రధానంగా చైనాలోని జింగ్జియాంగ్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో నివసిస్తున్నారు. తీవ్రమైన మత, సాంస్కృతిక అణిచివేతకు గురవుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సామూహిక నిర్బంధాలు, బలవంతపు వెట్టిచాకిరి, చివరకు వీగర్‌ ప్రజలపై బలవంతంగా గర్భనిరోధక చర్యలు చేపట్టడం వంటి అనేక ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతుందన్న ఆరోపణలు విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇటీవల చైనా వీగర్‌ ముస్లిములకు వ్యతిరేకంగా చేపట్టిన తీవ్రమైన మరో చర్య యాంటి హలాల్‌ మూమెంట్‌. జింగ్జయాంగ్‌ ప్రాంతంలో మత పరమైన  తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నామని చైనా అంటోంది. కాని వీగర్‌ సాంస్కృతిక, మతపరమైన ఆచార వ్యవహారాలను పూర్తిగా అణచివేయడానికి చైనా చేపట్టిన చర్యగా పలువురు విమర్శిస్తున్నారు. చైనా చేపట్టిన ఈ చర్య వల్ల ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల మంది ముస్లిములు ప్రభావితమవుతున్నారు. ఎందుకంటే ముస్లిముల ఆహారనియమాల్లో మౌలికమైన నియమాన్ని చైనా లక్ష్యంగా చేసుకుంది. ఈ చర్య వల్ల కేవలం వీగర్‌ ముస్లిములే కాదు ఇతర ముస్లిములు కూడా ప్రభావితుల వుతున్నారు.  హలాల్‌ ఉత్పత్తులనే ముస్లిములు తీసుకుంటారు. ఈ ఉత్పత్తులను  లక్ష్యంగా చేసుకోవడం ద్వారా చైనా వీగర్‌ ముస్లిముల మతాచారాలను మాత్రమే కాదు, అంతర్జాతీయంగా మొత్తం ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీ యంగా ముస్లిం సమాజం వీగర్‌ ముస్లిములకు మద్దతివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంగా చాలా మంది భావిస్తున్నారు. దశాబ్దాలుగా వీగర్‌ ముస్లిములు అణిచివేతలు భరిస్తున్నారు. జింగ్జియాంగ్‌లో దుర్భర పరిస్థితులను అనేక మానవహక్కుల సంఘాలు ఇప్పటికే బట్టబయలు  చేశాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా నిఘా ఉంటుంది. రాజ్యం ఎల్లప్పుడు వారిపై నిఘాపెట్టి ఉంటుంది. ముఖాలను గుర్తించే టెక్నాలజీ, పోలీస్‌ చెక్‌ పాయింట్లు, ఫోనులను స్కాన్‌ చేయడం మామూలు. సోకాల్డ్‌ రీ ఎడ్యుకేషన్‌ క్యాంపుల పేరిట సామూహిక నిర్బంధాలు జరుగుతున్నాయి. ఈ క్యాంపుల్లో నిర్బంధితులను బలవంతపెట్టి మతాన్ని వదిలేలా చేస్తున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ సమాజం చైనా విషయంలో ఖండనలు, ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఈ విధానాలు మార్చుకునేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. కాని చైనా, ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ విమర్శలు, ఖండనలను చైనా తేలిగ్గా ఎదుర్కొంటోంది. జింగ్జియాంగ్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. కాని అక్కడ మతపరమైన, సాంస్కృతికమైన అణిచివేత స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది. ఇప్పుడు హలాల్‌ ఉత్పత్తులను లక్ష్యం చేసుకోవడం కేవలం పైకి కనిపిస్తున్నది మాత్రమే. లోతుగా చూస్తే వీగర్‌ ముస్లిముల గుర్తింపును పూర్తిగా తుడిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీగర్‌ ముస్లిముల గుర్తింపు, సంస్కృతి, మతాచారా లను తుడిచేయాలనే ప్రయత్నాలు చైనా చేస్తోంది. కుటుంబాలు చిన్నాభిన్న మవు తున్నాయి. పిల్లలను ప్రభుత్వ శరణాల యాలకు బలవంతంగా తరలిస్తున్నారు. వీగర్‌ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక సముదాయాన్ని అణిచి వేయ డానికి ఎలాంటి హీనమైన చర్యలు తీసుకుం టుందో వీగర్‌ ముస్లిములపై చైనా తీసుకుం టున్న చర్యలు ఒక ఉదాహరణ. కాని యాంటి హలాల్‌ మూమెంట్‌ ద్వారా చైనా కేవలం వీగర్‌ ప్రజలనే కాదు యావత్తు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామం వల్ల అంతర్జాతీయ ముస్లిం సమాజం నుంచి వీగర్‌ ముస్లిములకు మద్దతు మరింత పెరగవచ్చని పలువురు భావిస్తున్నారు.

– ఆయిషా