December 28, 2024

ఒకడు భార్య మాట విని తల్లిని వదలి ఎక్కడికో దూరం వెళ్ళిపోతాడు. ఎన్నో కష్టాలు పడి మేము తినకపోయినా ఒక్క పూట పస్తులు ఉండి నిన్ను మంచి పొజిషన్‌లో పెట్టినాము నీకు రెక్కలు రాక ముందు మేము నీకు ఎలాగా చూసుకున్నాము. ఈనాడు నీకు రెక్కలు వచ్చినవి అని మమ్మల్ని వదిలి వెళ్ళి పోతున్నావా, నిన్ను మేము పోషించటానికి కూలి పని చేసినాము. ఇండ్లలో పాచి పని చేసినా ఈనాడు కన్న పేగును తల్లిని మోసం చేస్తున్నారు. తల్లికి మనశ్శాంతి లేకుండా చేసే సుపుత్రులు వున్నారు. అమ్మను బయటికి గెంటివేస్తున్నారు

– ముహమ్మద్ హనీఫ్, మార్కాపురం

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్ని వున్నా అందరి ప్రేమ కన్నవారి ప్రేమ ఒక్కటే. తల్లిదండ్రులు తమ కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టి, ఘనంగా పెళ్ళి చేసి పంపుతారు. అక్కడ నుంచి ఎంతో ఆనందంగా సంసారం సాగుతుంది. ఆమె గర్భవతి అయింది అని తెలిసిన తరువాత ఆ భార్యాభర్తలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కడుపులో పెరిగే బిడ్డను చూసు కుంటూ మురిసిపోతుంది. ఎందుకంటే నేను ఓ తల్లిని కాబోతు న్నాను అని ఆమె మనసులో ఎన్నో కోరికలు. బిడ్డ గురించి ఎన్నో కలలు కంటుంది. నవమాసాలు మోసి కని ప్రసవ వేదనతో బిడ్డను జన్మినిస్తుంది. తన బిడ్డను చూసుకుంటుంది. అప్పటినుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతుంది. గుండెలకు హత్తుకొని పాలు ఇస్తుంది. కొంత ఎదిగిన తరువాత గోరుముద్దలు తినిపి స్తుంది. అతని మీద ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. బాలుడు బడికి పోయే వయసు వస్తే తల్లి స్కూల్‌ బ్యాగ్‌ మోసుకుని పోయి స్కూల్‌లో వదిలిపెట్టి వస్తుంది. యుక్త వయసు వచ్చిన తరువాత అన్ని తెలిసిన తరువాత ప్రయోజకుడు అయిన తరువాత తల్లి అతని మీద పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా కూలిపోతుంటే ఏమి చెయ్యలేని పరిస్థితి చెయ్యిదాటి పోతూ ఉంటుంది. ఒకడు భార్య మాట విని తల్లిని వదలి ఎక్కడికో దూరం వెళ్ళిపోతాడు. ఎన్నో కష్టాలు పడి మేము తినకపోయినా ఒక్క పూట పస్తులు ఉండి నిన్ను మంచి పొజిషన్‌లో పెట్టినాము నీకు రెక్కలు రాక ముందు మేము నీకు ఎలాగా చూసుకున్నాము. ఈనాడు నీకు రెక్కలు వచ్చినవి అని మమ్మల్ని వదిలి వెళ్ళి పోతున్నావా, నిన్ను మేము పోషించటానికి కూలి పని చేసినాము. ఇండ్లలో పాచి పని చేసినా ఈనాడు కన్న పేగును తల్లిని మోసం చేస్తున్నారు. తల్లికి మనశ్శాంతి లేకుండా చేసే సుపుత్రులు వున్నారు. అమ్మను బయటికి గెంటివేస్తున్నారు.
ఆస్తులు పంచుకున్న తరువాత తల్లిదండ్రులకు మనశ్శాంతి గా బ్రతకనివ్వడంలేదు. ఆ తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఎంతో ఆలోచన చేసేవారు ఉన్నారు. ఎంతోమంది వృద్దాప్యంలో కన్నవారు వారికి బయటికి పంపితే చేరదీసే వారు లేక వారి మనసు ఎంత మధనపడుతుంది. ఆ తల్లి చావలేక బ్రతకలేక ఈ జీవితం ఇంత ఇంతమంది వున్నా దిక్కులేని అనాథగా మిగిలిపోవలసిందే అని గుండె బాదుకుంటుంది. బాధపడుతుంది.
మాతృమూర్తి విలువ తెలుసుకోలేక నలుగురిలో చులకన చేసి మాట్లాడే పుత్రులు ఉన్నారు. కొడుకు ఎన్ని తప్పులు చేసినా తిట్టినా కొట్టినా, దూషించినా, తిండిపెట్టకపోయినా వారు ఆస్తులు పంచుకున్నా తల్లి మనసులో స్వార్థం ఉండదు. అన్ని పోగొట్టు కున్నా తల్లి పాదాలు పట్టుకుని క్షమించు అని చెప్పినవెంటనే తల్లి మనసు కరిగిపోయి అన్నీ మరిచిపోతుంది. అది కన్న పేగు. సహనం వహించేదే మాతృమూర్తి. కొంతమంది కొడుకులు మత్తుకు బానిసలు అయి డబ్బులు ఇవ్వలేదు అని అతి దారుణంగా చంపినవారు ఉన్నారు. ఇటీవల పత్రికలో మద్యం మత్తులో కన్నవారినే ఇనుప కడ్డీతో కొడితే నెత్తుటి మడుగులో విలవిలల్లాడి చనిపోయింది.
‘‘తల్లి విలువ తెలుసుకున్నవారు వారి జీవితాలు అనందమవు తాయి’’
తల్లి మాటను జవదాటని పుత్రులు ఉన్నారు. తల్లి సేవను ఒక పరమార్థంగా భావించేవారు ఉన్నారు. తల్లికి ఎలాంటి కష్టంగాని, దుఃఖంగాని, బాధగాని రానివ్వకుండా చూసుకునే పుత్రులు ఉన్నారు. తల్లి ఒకమాట చెప్పిన వెంటనే తూ.చ తప్పకుండా చేసేవారు ఉన్నారు.
ఆ తల్లికి ఎలాగా సేవ చేసినది, తల్లిదండ్రులు మంచిగా చదివించారు. ఆ తరువాత అతనికి సౌదీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు తల్లికి క్యాన్సర్‌తో బాధ పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న పుత్రుడు వెంటనే సౌదీలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తల్లికి సేవ చెయ్యాలి అని తన భార్యతో వచ్చేశాడు. ఉన్న ఊర్లో ఏదో చిన్న అంగడి పెట్టుకుని జీవితం సాగిస్తూ తల్లికి వేళకు మందులు ఇస్తూ తల్లి సేవలో మునిగిపోయాడు.
వేరే తల్లి ముగ్గురు అక్కలు ఒక్క మగపిల్లవాడు. అక్కలు పెద్దవారు. వారి పెళ్లిళ్ళు తండ్రి వున్నప్పుడే జరిగిపోయినవి. కొంత కాలానికి తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోయింది. ఆ తల్లి కోమాలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకొని ఉంటుంది. అటుఇటు చూస్తుంది. మాట కూడా పడిపోయింది. ఆ తల్లి ఏమి మాట్లాడలేని స్థితి. తల్లిని చూసేవారు ఒకే ఒక్క బిడ్డ ఉన్నాడు. వారి అక్కలు వచ్చి నీవు పెళ్ళి చేసుకో అంటే నేను పెళ్ళి చేసుకోలేను ఎందుకు అంటే వచ్చే ఆమె నా కన్న తల్లిని చూస్తుందో లేదో అందుకు అని నేను పెళ్ళి చేసుకోలేను. అమ్మను చూసేవారు ఎవరు లేరు కదా, మీరు అత్తారింటికి వెళ్ళిపోతారు. మీ సంసారం మీ కష్టసుఖాలు మీకు ఉన్నాయి అన్నాడు. నీవు ఒక్కడివే కదా అయినా ఫర్వాలేదు. ఆ దైవం నాకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. నేను మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను. అప్పటి నుంచి తల్లి సేవలో మునిగిపోయాడు. కన్నవారి కలలను నిజం చేసిన ఏకైక పుత్రుడు అది ఎలాంటి సేవ అంటే చిన్నతనంలో నాకు ఎలాంటి సేవ చేసిందో. ఇప్పుడు ఆ బిడ్డ ఆ తల్లికి అదేవిధంగా సేవ చేస్తువున్నాడు. ఆ తల్లి మనసులోనుంచి కన్నీటి రూపంలో తల్లి అదే పనిగా అతని వైపు చూస్తుంది. తన కుమారుడు ఆ తల్లి సేవ చెయ్యటం మరపురాని మరిచిపోనిది. తల్లి పనులు చేసిన తరువాత అతను స్కూల్‌లో పనిచేసేవాడు. టైమ్‌కు వచ్చి తల్లికి తినిపించి పోయేవాడు. మళ్ళీ రాత్రి పాలు తాపించేవాడు.
ఇరుగు పొరుగు వారితో ఎంతో ప్రేమానురాగాలతో వుండేవాడు. అందరికి ఎంతో ప్రేమతో పలకరించేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సంవత్సరాలు తల్లి సేవలోనే ఉన్నాడు. ప్రతి రోజు తల్లి బట్టలు మార్చేవాడు. మంచం మీద మెల్లగా దుప్పట్లు పరిచేవాడు. ఆ రాత్రి తల్లి దగ్గరకు వచ్చి అమ్మ ఈ రోజు నా గుండెలో నొప్పిగా ఉన్నది. నాకు ఎలాగో ఉంది. ఆ తల్లి తన కుమారుడు చెప్పిన మాటలు వింటుంది. కాని ఏమి చెయ్యలేని పరిస్థితి. ఎవరికి పిలవలేదు. ఇంట్లో తల్లి కొడుకు తప్ప ఎవరులేరు. ఆ రాత్రి చివరి రాత్రి అని అతనికి కూడా తెలియదు. తల్లి కళ్ళలోనుంచి నీరు వస్తుంది. ఏడుస్తుంది. నొప్పి అని చెప్పి సోఫా మీద వాటిపోయాడు. తల్లిని చూస్తూ తల్లి ముందు అతని ప్రాణం పోయింది.
తలుపు గడియ పెట్టివున్నారు. రెండు రోజులు అవుతుంది. స్కూల్‌లో పనిచేసే వ్యక్తి రెండు రోజులు అవుతుంది. ఫోన్‌ చేస్తే ఎత్తడంలేదు అని అనుమానంతో స్కూల్‌ వారు ఇంటికి వచ్చారు. చూస్తే తలుపులు గడియ పెట్టి ఉన్నది. చుట్టుపక్కల వారికి పిలిచారు. అందరూ కలిసి తలుపులు పగలగొట్టి చూస్తే ఏముంది… విగతజీవిగా పడివున్నాడు. తల్లి మూగవోయింది. అందరూ చూసి డాక్టర్‌ గారిని పిలిచారు. డాక్టర్‌ నాడి చూసి రెండు రోజులు అయినది చనిపోయి అన్నాడు. ప్రాణం ఎప్పుడో పోయింది. తల్లి మనసులోనుంచి కన్నీరు ఆగలేకపోతుంది. తరువాత అందరికి ఫోన్‌ చేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే తల్లి కూడా చనిపోవటం జరిగింది.
ఒక వ్యక్తి దైవప్రవక్త(స) దగ్గరికి వచ్చి దైవప్రవక్తా నా మంచి ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువగా హక్కుదారులెవరు? అని అడిగాడు. దానికి ఆయన(స) ‘నీ తల్లి’ అని చెప్పారు. ఆ తరువాత ఎవరు? అని అడగ్గా ఆయన(స) ‘నీ తల్లి’ అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ తరువాత ఎవరు? అని అడగ్గా అప్పుడు కూడా ‘నీ తల్లి’ అనే చెప్పారు. దైవప్రవక్త(స) ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు ఆ తరువాత ఎవరు? అని. అప్పుడు ‘నీ తండ్రి’ అని చెప్పారు. (బుఖారీ` ముస్లిమ్‌)