నమాజు ఆదేశం
‘‘నిశ్చయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిరది’’. (దివ్య ఖుర్‌ఆన్-4: 103)
సలాత్- లేదా నమాజు అత్యంత ప్రాచీనమయిన ఆరాధన. ప్రవక్త ఇస్మాయీల్(అ) గారి గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘‘అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు’’ (మర్యం: 55)
దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి దైవదౌత్యం అనుగ్రహించబడి నప్పుడు (మేరాజ్‌కి పూర్వం వరకు) అయన ప్రతి ఉదయం రెండు రకాతులు, ప్రతి సంధ్యా సమయం రెండు రకాతులు చేసేవారు. అల్లాప్‌ా, ప్రవక్త(స) వారినుద్దేశించి ఇచ్చిన ఆదేశ సారాంశం ఇదేనని కొందరు వ్యాఖ్యానించారు.
‘‘నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.’’ (గాఫిర్: 55)
సలాత్ : అంటే భాషాపరంగా దుఆ (ప్రార్థన) అని అర్థం.
సలాత్ : షరీయతు పరిభాషలో కొన్ని ప్రత్యేకమైన క్రియలు, మాటలు. అవి తక్బీర్ (అల్లాహు అక్బర్)తో మొదలయి తస్లీమ్ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్)తో పూర్తవుతాయి. సలాత్ నామకరణానికి కారణం అందులో అత్యధిక శాతం వేడుకోలు ఉండటమే.
ఫర్జ్ నమాజులు : ప్రతి ముస్లింపై దైవంచే విధి గావించబడిన ఫర్జ్ నమాజులు. అవి: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా.
శాస్త్ర ప్రమాణం
ప్రవక్త(స) వారిని ఏ రాత్రయితే మస్జిదె హరామ్ నుంచి మస్జిదె అఖ్సా వరకు ఇస్రా చేయించి, అక్కడి నుండి ఆకాశాలపైకి మేరాజ్ కోసం తీసుకెళ్ళడం జరిగిందో అదే రాత్రి అయిదు పూటల ఫర్జ్ నమాజులు విధించబడ్డాయి. అల్లాప్‌ా ఇలా సెలవిచ్చాడు: ‘‘కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లాప్‌ా పవిత్రతను కొనియాడండి. భూమ్యాకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయాన కూడా అల్లాప్‌ా పవిత్రతను కొనియాడండి’’ (రూమ్: 17,18)
‘తనపై ఏ కార్యాలు విధి?’ అని అడిగిన పల్లెవాసిని ఉద్దేశించి దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ‘‘రేయింబవళ్ళలో అయిదు పూటల నమాజు’’. అది విన్న పల్లెవాసి ఇవి తప్ప ఇంకేమయినా ఉన్నాయా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు దైవప్రవక్త(స): ‘లేవు. అయితే నఫిల్ ఆరాధనలు నువ్వు చేసుకుంటే తప్ప’ అని బదులిచ్చారు. (బుఖారి 46, ముస్లిం 11)
నమాజ్ ఆదేశ పరమార్థం
1) మనిషికి అతని జీవితంలోని అసలు లక్ష్యాన్ని ఎరుకపర్చడం.
2) సకల విషయాల కారకుడు అల్లాహ్ మాత్రమేనని, సహాయం చేయడం, అనుగ్రహించడం, మేలు చేకూర్చడం, బ్రతికించడం, చంపడం, ఆయన ఒక్కడికి మాత్రమే సాధ్యమన్న విషయాన్ని నమాజీకి గుర్తు చేయడం.
3) నమాజు ద్వారా అతని వల్ల జరిగిన పాపాలను ప్రక్షాళనం గావించుకునే సదవకాశం లభిస్తుంది.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్(ర) గారి కథనం : దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ‘‘అయిదు పూటల నమాజు ఉపమానం ఎలాంటి దంటే, మీలోని ఓ వ్యక్తి వాకిలి ముందు స్వచ్ఛమయిన మంచి నీటి కాలువ ప్రవహిస్తూ ఉంది. అతను ఆ కాలువలో రోజుకి అయిదుసార్లు స్నానం చేస్తున్నాడు. అప్పుడు అతని శరీరం మీద ఎలాంటి మైల అయినా ఉండగలదా?’’ (ముస్లిం 668) అబూ హురైరా(ర) గారి వేరొక ఉల్లేఖనంలో ‘‘అటువంటిదే నమాజు ఉపమానం. అల్లాహ్ అయిదు పూటల నమాజు ద్వారా పాపాల న్నింటినీ తుడిచివేస్తాడు.’’ అని ఉంది. (ముస్లిం 667)
4) ఆత్మకు కావాల్సిన అల్లాహ్ పట్ల విశ్వాసంతో కూడిన ఉపాధి నిరంతరాయంగా దానికి అందుతూ ఉండాలి. ఏ ముస్లిం అయితే నమాజులను క్రమం తప్పకుండా పాటిస్తాడో అతన్ని ఐహిక బాధలు, సమస్యలు బలహీన పర్చజాలవు. అతని ఆత్మ విశ్వాసంలో ఎటువంటి మార్పు రాదు.
నమాజు ఎవరి మీద విధి?
ప్రాజ్ఞతకు చేరిన బుద్ధిమంతులయిన ప్రతి ముస్లిం స్త్రీ పురుషుని మీద నమాజు విధిగావించబడిరది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘‘ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకాగ్నికి తీసుకువచ్చింది అని అపరాధులను ప్రశ్నించడం జరుగుతుంది. వారిలా సమాధానం ఇస్తారు: మేము నమాజు చేసేవారము కాము’’. (ముద్దస్సిర్: 42,43)
ప్రాజ్ఞతకు చేరని బాలునిపై నమాజు విధికాదు. అయితే పిల్లోడు ఏడేండ్ల వయసుకు చేరాక అతనికి నమాజును గురించి ఆదేశిస్తూ ఉండాలి. అతను పదేండ్ల వయసుకి చేరాక నమాజును వదిలితే దండిరచాలి. ఉద్దేశం నమాజు అలవాటు చేయడమే.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ముగ్గురిపై ఎటువంటి విధి లేదు. 1) పడుకున్న వ్యక్తి నిద్ర మేల్కోనంత వరకు. 2) పిల్లోడు ప్రాజ్ఞతకు చేరనంత వరకు. 3) మతిస్థిమితం లేని వ్యక్తికి మతి స్థిమితం కలగనంత వరకు.’’ (అబూదావూద్ 4403)
ఖజా : అంటే నమాజు వేళ అయిపోయాక ఆ నమాజుని చేయడం లేదా ఒక రకాతు కూడా చేసేంత సమయం లేకపోవడం.
అన్ని మస్లక్‌ల పండితులు ఈ విషయమయి ఏకీభవించారు. నమాజును వదిలేసిన వ్యక్తి దాని ఖజా చేసుకోవాలి. దాన్ని అతను మరచి వదలినా, తెలిసి వదిలినా, క్రింది వివరణతోపాటు, తగు కారణం వల్ల, మరచిపోవడం వల్ల, నిద్ర వల్ల, నమాజు తప్పిపోతే పాపం కాదు, అతను తక్షణమే ఖజా చేయాల్సిన అవసరమూ లేదు. అయితే ఎలాంటి కారణం లేకుండా కావాలనే నమాజును వదలడం పాపం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ నమాజును పూర్తి చేసుకోవాలి.
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరయినా (నమాజు నుండి) నిద్రపొయినా, లేదా మరుపుకి గురయినా గుర్తు వచ్చినప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ‘‘నీవు నా స్మరణ కోసం నమాజును స్థాపించు’’ (ముస్లిం 684)
నమాజు వల్ల కలిగే లాభాలు
సాఫల్య పూచీ నమాజు : దైవప్రవక్త(స) ఇలా అన్నారు: దైవదూత జిబ్రీల్(అ) నా వద్దకు వచ్చి, అల్లాహ్ ఇలా అంటున్నాడని తెలియ జేశారు: ‘‘నేను నీ సముదాయం మీద అయిదు పూటల నమాజును విధిగావించాను. ఎవరయితే వాటి వేళలు, వుజూ, రుకూ, సజ్దాలతో సహా పూర్తి చేస్తారో వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తానన్న జమానతు నా వద్ద ఉంటుంది. మరెవరయినా వీటిలో ఏదేని విషయంలో జాప్యం చేస్తే, అతని కోసం నా వద్ద ఎటువంటి పూచీలేదు. నేను తలిస్తే అతన్ని శిక్షిస్తాను, నేను తలిస్తే అతన్ని కరుణిస్తాను’’. (తబ్రానీ-అల్బానీ-రహ్మ-ధ్రువీకరించారు)
‘‘నిశ్చయంగా ఒక వ్యక్తి నమాజులో ప్రవేశిస్తే అల్లాప్‌ా అతని వైపు మళ్ళుతాడు. అతను నమాజు నుండి వెనుదిరగనంత వరకూ, ఏదేని చెడు విషయం మాట్లాడనంత వరకూ ఉంటాడు’’ అన్నారు ప్రవక్త (స). (ఇబ్నుమాజహ్)
‘‘నిశ్చయంగా దాసుడు నమాజు కోసం నిలబడినప్పుడు అతని పాపాలను తీసుకొచ్చి అతని భుజం, తలపై ఉంచడం జరుగు తుంది. అతను రుకూ, సజ్దా చేసినప్పుడల్లా అవి అతన్నుండి జారి పడతాయి’’ అన్నారు ప్రవక్త (స) (తబ్రానీ)
‘‘ఈ నమాజులను ఎవరయితే క్రమం తప్పకుండా ఆదేశ, ఆదాబులతోపాటు పాటిస్తారో వారు నిర్లక్ష్యపరుల జాబితాలో చేర్చబడరు. మరెవరయితే ఒక రాత్రిలో 100 ఆయతులు పారాయణం చేస్తారో వారు పూర్తిగా అల్లాహ్ ను నమ్ముకున్న వారి జాబితాలో చేర్చ బడతారు’’ అన్నారు ప్రవక్త (స). (హాకిమ్)
‘‘మధ్యలో ఎటువంటి అనవసర క్రియకు పాల్పడకుండా ఒక నమాజును వెంబడిరచి మరో నమాజును చేయడం అనేది, చేసే వ్యక్తి కర్మల పుస్తకం ఇల్లియ్యీన్‌లో ఉండేలా చేస్తుంది’’ అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్)
ప్రథమ ప్రశ్న నమాజు
‘‘ప్రళయ దినాన మొదట దాసుణ్ణి నమాజును గురించే అడగటం జరుగుతుంది. అది గనక సరిగ్గా ఉంటే అతని ఇతర కర్మలు సయితం సరిగ్గా ఉంటాయి. అది గనక పాడయి ఉంటే అతని ఇతర కర్మలు సయితం పాడయి ఉంటాయి’’ అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ)
పరలోక మోక్షం నమాజు
‘‘ఎవరయితే నమాజును కాపాడుకుంటాడో ప్రళయ దినాన అది అతని కోసం జ్యోతిగా, ప్రమాణ నికషంగా, మోక్షంగా మారుతుంది. మరెవరయితే దాన్ని వృధా గావిస్తాడో అతని కోసం ఎలాంటి జ్యోతి, ప్రమాణం, మోక్షం ఉండదు. అలాంటి వ్యక్తి ప్రళయ దినాన ఖారూన్, ఫిరౌన్, హామాన్, ఉబై బిన్ ఖలఫ్ వంటి దుష్టుల సరసన ఉంటాడు’’ అన్నారు ప్రవక్త (స). (ముస్నద్ అహ్మద్)
పూర్తి రాత్రి ప్రార్థన పుణ్యం
‘‘ఎవరయితే ఇషా నమాజును జమాఅత్‌తో చేస్తారో వారు సగం రాత్రి ప్రార్థన చేసినట్లు. మరెవరయితే ఇషా నమాజను జమాఅత్‌తో చేయడంతో పాటు ఫజ్ర్ నమాజును జమాఅత్‌తో చేస్తారో వారు పూర్తి రాత్రి ప్రార్థనలో గడిపినట్లు’’ అన్నారు ప్రవక్త(స). (ముస్లిం)
‘‘ఒక వ్యక్తి క్రమం తప్పకుండా మస్జిద్‌కెళ్లి నమాజు చదువు తున్నాడు. మధ్యలో ఏదో అనివార్య కారణం చేత అతను హాజరు కాలేక పోయాడు. కారణం తొలిగాక అతను మస్జిద్‌కొచ్చాడు. ‘తప్పిపోయిన, సుదూర ప్రయాణం మీద ఉన్న వ్యక్తి ఇంటివారు ఆ వ్యక్తి రాకతో ఎంత సంతోషిస్తారో ఈ నమాజీ రాకతో అల్లాప్‌ా అంతకన్నా ఎక్కువ సంతోషిస్తాడు’’ అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను ఖుజైమహ్)
చివరి ప్రార్థనలా ఉండాలి ప్రతి నమాజు
‘‘నువ్వు నమాజులో మృత్యువును గుర్తు చేసుకో! నిశ్చయంగా మనిషి గనక తన నమాజులో మరణాన్ని స్మరించుకుంటే తన నమాజును అత్యంత శ్రద్ధాభక్తులతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ నమాజు తర్వాత మరో నమాజు చెయ్యలేను అన్న స్పృహతో చేస్తాడు. అలాగే తర్వాత తలవంపును తెచ్చి పెట్టే (క్షమాపణ చెప్పుకునేలా చేసే) ఏ పనీ చెయ్యకు’’ అన్నారు ప్రవక్త (స). (దైలమీ-ముస్నద్ ఫిర్‌దౌస్)
నమాజు చేయని వ్యక్తి గురించి ఆదేశం
నమాజును వదిలే వ్యక్తి సోమరితనం లేదా నిర్లక్ష్యం వల్లనో నమాజు వదులుతాడు. లేదా దాన్ని వ్యతిరేకిస్తూ అయినా వదులుతాడు. నమాజు విధి అన్న విషయాన్ని అంగీకరిస్తూనే సోమరితనం వల్ల దాన్ని విడనాడే వ్యక్తిని అధికారికంగా తౌబా చేసుకుని మరొక్కసారి అటువంటి పాప కార్యానికి పాల్పడ కూడ దని మాట తీసుకోవాలి. అయినా అతను మారకపోతే అతన్ని వధించడం తప్పనిసరి అవుతుంది. అతని వధ ధర్మ పరిధులను అతిక్రమించినందుకు శిక్షగా భావించబడుతుంది. అయితే అతను ముస్లింగానే పరిగణించబడతాడు. అతని మరణా నంతరం శవ సంస్కారం లోనూ, వారసత్వ ఆస్తి పంపిణిలోనూ ఇస్లామీయ షరీఅతునే అనుసరించాలి. ఎందుకంటే, తాను పాపం చేసినప్పటికీ ముస్లిమే గనక. (ఈ ఆదేశం ఇస్లామీయ వ్యవస్థ ఉన్న దేశంలో మాత్రమే)
ఇక ఎవరయితే నమాజు విధి అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ వాగ్వివాదానికి దిగుతాడో లేదా అవహేళనగా ఏదయినా అంటాడో అతను అవిధేయతకు పాల్పడినవాడయి ఇస్లాం పరిధి నుండి వైదొలుగుతాడు. అధికారికంగా అతన్ని తౌబా చేయ వలసిందిగా ఉత్తర్వులు జారి చేయాలి. తౌబా చేసుకుని, నమాజు స్థాపించాడా సరి. మారకపోతే అతన్ని వధించడం తప్పనిసరి అవుతుంది. అతను ఇస్లాం పరిధి నుండి వైదొలుగుతాడు. ఒకవేళ అదే స్థితిలో మరణిస్తే ఇస్లామీయ సంప్రదాయాన్ననుసరించి అతనికి స్నానం చేయించ డంగానీ, జనాజా నమాజు చేపించడం గాని చేయకూడదు. అలాగే అతని శవాన్ని ముస్లింల శ్మశానంలో ఖననం చేయకూడదు. ఎందుకంటే అతను ముస్లింలోని వాడు కాదు. (ఈ ఆజ్ఞ ఇస్లామీయ వ్యవస్థ స్థాపించబడిన రాజ్యంలో మాత్రమే వర్తిస్తుంది)
జాబిర్ (ర) కథనం: నేను దైవప్రవక్త(స) వారు ఇలా చెబుతుండగా విన్నాను: ‘‘మనిషికి మరియు షిర్క్, కుఫ్ర్‌కి మధ్య గల అడ్డు నమాజును వదలడమే’’. (ముస్లిం:82)