హమాస్ సాయుధులు ఇస్రాయీల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అమాయకులు మరణించారు. కొందరిని సాయుధులు నిర్బంధించి తీసుకుపోయారు. ఈ దాడి తర్వాత ఇస్రాయీల్ హమాస్‌ను తుడిచేస్తామంటూ గాజాపై దాడులు మొదలు పెట్టింది. గాజా దాడుల్లో 12 వేల మందికి పైగా మరణించారు. ఇందులో సగానికి పైగా పిల్లలు, పసిపిల్లలు, మహిళలున్నారు. వీళ్ళల్లో ఎవ్వరు కూడా హమాస్ సాయుధులు కారు. మిగిలిన సగంలోను చాలా మంది ముసలివారు, రోగులున్నారు. వారు కూడా హమాస్ సాయుధులు కారు. నిజానికి ఇస్రాయీల్ దాడుల్లో మరణించిన వారంతా అమాయక ప్రజలు. హమాస్ సాయుధులను అంతం చేశామని ఇంత వరకు ఇస్రాయీల్ చెప్పుకోలేకపోయింది. ఆసుపత్రులపై దాడులు చేసి పసిపిల్లలను చంపిన హంతక రాజ్యం ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలున్నాయని నిరూపించడానికి చేసిన ప్రయత్నాల్లో డొల్లతనాన్ని అనేకమంది విశ్లేషకులు బయటపెట్టారు. గాజాపై ఇస్రాయీల్ దాడులకు వంతపాడుతున్న అమెరికా కూడా ఇందులో హంతకపాత్ర పోషిస్తోంది. ఇస్రాయీల్, అమెరికాల వైఖరిని ఇప్పుడు యావత్తు ప్రపంచం అసహ్యించుకుంటోంది. ఖండిస్తోంది. ఈ యుద్ధంలో ఇస్రాయీల్ గెలిచే అవకాశాలు లేవని చాలా మంది వాదించడంలో నిజమూ ఉండవచ్చు. కాని, గాజాలో పసిపిల్లలను హతమారుస్తున్న ఇస్రాయీల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానంలో శిక్షించడం సాధ్యపడుతుందా?
ఇస్రాయీల్‌ను అరబ్బు దేశాల మధ్య ఏర్పాటు చేసింది అమెరికా. కాని అమెరికా ఇప్పుడు ఇస్రాయీల్ చేతిలో ఆటబొమ్మగా ఎలా కీ ఇస్తే అలా ఆడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయ స్థానంలో పసిపిల్లల హంతకులకు శిక్ష పడుతుందని ఆశించగలమా? అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా, ఇస్రాయీల్ దేశాలు సభ్య దేశాలు కావు. ఇస్రాయీల్ అంతర్జాతీయ చట్టానికి తూట్లు పొడవడం అనేది ఇదే మొదటిసారి కాదు. ఎన్నడూ ఇస్రాయీల్‌ను నిలదీసిన వాడెవ్వడూ లేడు. ఇస్రాయీల్ చేస్తున్న హత్యలను ఎవరు ఎంతగా ఖండిరచినా, ఈ నేరాలకు శిక్ష పడడం సాధ్యపడే పరిస్థితే కనిపిం చడం లేదు. నేరాలకు శిక్షలు పడకపోతే న్యాయం ఎలా జరుగు తుంది? న్యాయం జరగనిదే శాంతి సాధ్యం కాదు.
ఇస్రాయీల్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యదేశం కాకపోయి నప్పటికీ, ఇస్రాయీల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు నడవవచ్చు. ఈ కేసును నెతన్యాహు వ్యతిరేకిస్తాడు. అమెరికా నెతన్యాహుకు వంతపాడుతుంది. సుదీర్ఘ విచారణ జరగ వచ్చు. నెతన్యాహుపై విచారణ జరపాలని ఇప్పటికే టర్కీ ధరఖాస్తు చేసింది. యుద్ధ నేరాలకు విచారణ జరిపి శిక్షించాలని కోరుతోంది. కొలంబియా, అల్జీరియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బొలివియా ఇలా ఎన్ని దేశాలు, చివరకు ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి కోరినా అమెరికా అడ్డుకుంటే నెతన్యాహును విచారించడం సాధ్యం కాదు. ఇస్రాయీల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాదు. పాలస్తీనాలో అమానుషాలను కొనసాగిస్తూనే ఉంటుంది.
హమాస్‌ను తుడిచేస్తామంటూ నిరాయుధులను, ఆసుపత్రుల్లో ఉన్న పసిపాపలను హతమార్చి యుద్ధం చేస్తున్నామంటూ చెప్పుకునే దేశం చివరకు సాధించేదేముంటుంది? అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లను తుడిచేస్తామంటూ 2001లో ఇలాగే అమెరికా యుద్ధం ప్రారంభిం చింది. తర్వాత తాలిబాన్లు మరింత బలపడ్డారు. ఇప్పుడు అఫ్గనిస్తాన్‌లో అదే తాలిబాన్ ప్రభుత్వం నడుస్తోంది. అమెరికాలోని బడా ఆయుధ వ్యాపారులు దండిగా సంపాదించుకునే అవకాశాలు పొందారు. ఇరాక్‌లో రసాయనిక ఆయుధాలున్నాయని అమెరికా యుద్ధం చేసింది. ఇప్పుడు అదే ఇరాక్ పాలస్తీనా విషయంలో అమెరికాతో తలపడేలా కనిపిస్తోంది. ఇస్రాయీల్ హమాస్‌ను తుడిచేసిందా? నలభై రోజులకు పైబడిన యుద్ధంలో బాంబుల వర్షాలు కురిపించి అమాయకులను చంపడమా యుద్ధమంటే? ఇలాంటి యుద్ధం హమాస్‌ను మరింత బలపడేలా చేయడం లేదా? ఈ అమానుష అణిచివేతలు కొనసాగడం, యుద్ధం పేరుతో హత్యాకాండ కొనసాగించటం, ఈ యుద్దనేరాలకు శిక్షలు పడకపోవడం ఇలాగే కొనసాగితే హింసాకాండల విషవలయం కొనసాగుతూనే ఉంటుంది. న్యాయాన్ని కాపాడలేకపోయినప్పుడు శాంతిని సాధించడం కష్టం. అందుకే దివ్యఖుర్‌ఆన్ స్పష్టంగా చెప్పింది.
‘‘విశ్వసించిన ప్రజలారా! న్యాయధ్వజవాహకులుగా నిలబడండి. అల్లాప్‌ా కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగిం చినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాప్‌ా వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాప్‌ాకు తెలుసు అని.’’
(దివ్యఖుర్‌ఆన్: 4:135)
అబ్దుల్ వాహెద్